టాలీవుడ్ డార్లింగ్, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ‘క‌ల్కి 2898 AD’ థియేట‌ర్ల‌లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇక ఈ సినిమాను చూసేందుకు తెలుగు ప్రేక్ష‌కులు మాత్రమే కాకుండా యావత్ భారత సినిమా ప్రేక్షకులకు థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం... నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ను గల్లంతు చేస్తుందని లెక్కలు చెబుతున్నాయి.

సినిమా ఎలా ఉంది?
దేశంలో అన్ని చోట్లా బెనిఫిట్ షోస్ పడినట్టు సమాచారం. షో నుండి బయటకు వచ్చిన జనాలంతా బొమ్మ బ్లాక్ బ్లాస్టర్ అని కేరింతలు కొడుతుండడం మనం సోషల్ మీడియాలో గమనించవచ్చు. అది మాత్రమే కాకుండా అర్ధరాత్రి US పడిన షోస్ ద్వారా కూడా కల్కి సినిమాకి పాజిటివ్ టాక్ రావడం విశేషం. దాంతో యావత్ ప్రభాస్ అభిమానులంతా థియేటర్ల వద్ద టపాసులు పేల్చుకుంటూ కేరింతలు కొడుతున్నారు.

సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే:
దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దిన వైనాన్ని కొనియాడకుండా ఉండలేము. అశ్వద్ధామగా బిగ్ బి అమితాబ్, కల్కిని కన్నతల్లిగా దీపికా, ప్రభాస్ తమ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసారు. ప్రధానంగా పాత్రల పరిచయం చూస్తే న భూతో న భవిష్యతి. సినిమాలోని సాంగ్స్ మునుపెన్నడూ లేని విధంగా తెరకెక్కించారు. విజువల్స్ గ్రాండియర్ గురించి చెప్పుకోవాలంటే బహుశా ఇండియాలోనే ఇలాంటి విజువల్స్ మునుపెన్నడూ లేని విధంగా చేయించారు నాగ్ అశ్విన్. ఈ విషయంలో దర్శకుడు నాగ్ ని పొగడకుండా ఉండలేము. సినిమాని దర్శకుడు ఎక్కడ లేపాలో అక్కడ లేపిన విధానం సూపర్బ్. ముఖ్యంగా ఇంట్రో, ఇంటర్వెల్, అండ్ క్లైమాక్స్ అదరహో. చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్లి చూడదగ్గ సినిమా క‌ల్కి 2898 AD అని చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్:
సినిమా అక్కడక్కడా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఒక పెద్ద పాయింట్ ని టచ్ చేయడం వలన పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని దర్శకుడు కాస్త వివరించి చెబితే బావుండేది. సంతోష్ నారాయణ్ నేపధ్య సంగీతం బావున్నప్పటికీ ఇంకాస్త బావుంటే బావుండేది. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా సినిమా చూసేటప్పడు ప్రభాస్ పాత్ర నిడివి కాస్త తక్కువ అని అనిపించకమానదు. ఈ అంశాలు తప్ప మరేవీ పెద్దగా సమస్యగా కనబడవు.

గమనిక: క‌ల్కి పార్ట్-2 కూడా ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: