'క‌ల్కి 2898AD' థియేట‌ర్ల‌లోకి వచ్చి రావడంతోనే రికార్డుల కోత షురూ చేసింది. దేశంలోని వేల సంఖ్య థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్షాఫీస్ వద్ద బాక్సింగ్ ఆడుతోంది. అవును, ఊహించిన దానికన్నా భారీ రెస్పాన్స్తో దూసుకెళ్తోంది డార్లింగ్ సినిమా. సినిమాను చూసిన ప్రీమియర్ షో ప్రేక్ష‌కులు, మార్నింగ్ షో ప్రేక్షకులు థియేట‌ర్ల‌ నుండి బయటకి వస్తూ కేరింతలు కొడుతున్నారు. సినిమా బ్లాక్బస్టర్ హిట్ అని అంటున్నారు. మహానటి ఫేమ్ నాగ్అశ్విన్ తెర‌కెక్కించిన ఈ సినిమా ఖచ్చితంగా ఇంతకుమునుపు ఉన్న రికార్డులన్నిటినీ శాసిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే, సినిమా రిలీజ్కు కాసేపు ముందు ప్ర‌భాస్, నాగ్అశ్విన్ ఇన్స్టా లైవ్లోకి వ‌చ్చి అభిమానులతో అనేక విషయాలను పంచుకున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ క్ర‌మంలోనే క‌ల్కి పార్ట్-2 కూడా ఉండ‌బోతుంద‌ని వారు చెప్పకనే చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే క‌ల్కి రెండో భాగం టైటిల్పై అదే లైవ్లో అభిమానులు ముచ్చటించారు. క‌ల్కి సీక్వెల్కు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉండాల‌ని, క‌ల్కి 3102 bc అయితే బాగుంటుందని అనేకమంది సూచించగా దీనికి నాగ్అశ్విన్ కూడా ఇంప్రెస్ అయినట్లుగా తన ఎక్స్ప్రెషన్స్ తెలియజేసారు. ఇకపోతే సినిమా అయిపోయిన తరువాత చూడాలి పార్ట్ 2 ఉంటుందని మెన్షన్ చేసినప్పటికీ ఫలానా అనే టైటిల్ ఇంకా రివీల్ చేయలేదని అంటున్నారు అభిమానులు.

ఈ ఒక్క విషయంలో డార్లింగ్ అభిమానులు కాస్త నిరాశ పడినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అందులో కొందరు మాత్రం క‌ల్కి 3102 bc అయితే బాగుంటుందని ఫీల్ అవుతూ... నాగ్ అశ్విన్ కి ట్యాగ్ చేస్తున్నారు. మరి ఈసారి రాబోయే ఈ సినిమా పార్ట్ 2కి ఎలాంటి టైటిల్ పెడతారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే సినిమా బ్లాక్ బ్లాస్టర్ అని తెలుస్తోంది. దాంతో యావత్ ప్రభాస్ అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: