రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898AD. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే, దిశాపటాని, నాని, విజయ్ దేవరకొండ ,మాళవిక నాయర్ తదితర నటీనటుల సైతం ఇందులో నటించారు. కల్కి చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ ,కన్నడ, మలయాళం వంటి భాషలలో విడుదల చేశారు. కల్కి సినిమా మొత్తం కురుక్షేత్రం జరిగిన ఆరువేల సంవత్సరాల తర్వాత కథ అన్నట్టుగా తెలుస్తోంది.


కల్కి చిత్రంలో వాడినటువంటి విఎఫ్ఎక్స్ అద్భుతంగా కనపరిచింది. ముఖ్యంగా కాంప్లెక్స్, ఆకాశం, శంబల సినిమా చూసిన ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కాంప్లెక్స్ లోనే కొంతమంది ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా గర్భం దాల్చేలా అమ్మాయిలను చేస్తూ ఉంటారు. ఆ గర్భం నుండి సీరం సేకరించి  సుప్రీం మాస్కిన్ (కమలహాసన్) కు అందిస్తూ ఉంటారు. దీనికే ప్రాజెక్ట్ -k అని పెడతారు. అయితే ఇలా గర్భం దాల్చిన ఏ అమ్మాయి కూడా 100 రోజుల కంటే ఎక్కువగా బతకదట.. కానీ సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొనే 100కంటే ఎక్కువ రోజులు గర్భం దాలుస్తుంది. ఆమె నుంచి సీరం సేకరించి సమయంలోనే ఈ కాంప్లెక్స్ నుంచి తప్పించుకుంటుందట.


ముఖ్యంగా సుమతిని తీసుకువస్తే భారీ నజరాలను ప్రకటిస్తారు. దింతో కాంప్లెక్స్ లోకి ఎంట్రీ భైరవ (ప్రభాస్) ఇస్తారు. అతని చేతికి చిక్కకుండా అశ్వద్ధామ (అమితాబచ్చన్) కాపాడుతూ ఉంటారు.. అసలు సుప్రీమ్ మాస్కిన్ ప్లాన్ ఏమిటి..? శంబల ఎక్కడ ఉంది..? అక్కడ మనుషులు కాంప్లెక్స్ రెబల్స్ కింద ఎందుకు మారుతారు..? కల్కి ఎవరు అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇప్పటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద రానటువంటి ఒక ప్రపంచాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసుకువచ్చారు. ప్రభాస్ కూడా ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ ప్లే చేశారు.. ఒకటి బైరవ రెండవది ఏమిటనేది స్క్రీన్ మీద చూడాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కంటే ఎక్కువగా అశ్వర్ధామగా అమితాబచ్చన్ కనిపిస్తూ ఉండడం గమనార్హం. ఆయన నటన రూపం అందరినీ ఆకట్టుకుంది. కమలహాసన్ స్క్రీన్ మీద కనిపించేది చాలా తక్కువే ఆయన తన మార్కు చూపించారు. మధ్య మధ్యలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కల్కి 2898AD సినిమాని ఒక్కమాటలో చెప్పాలి అంటే ఒక విజువల్ వండర్ అని చెప్పవచ్చు. బుజ్జి ప్రభాస్ మధ్య జరిగే కామెడీ సంభాషణ కూడా అందర్నీ ఆకట్టుకుంది. అలాగే దుల్కర్ సల్మాన్  కీలకమైన పాత్రలో నటించారు. ప్రేక్షకులకు కూడా సరికొత్త కథనాన్ని చూపించారు డైరెక్టర్. మరి ఇలాంటి విజువల్ వండర్తో బాహుబలి ,సలార్ చిత్రాల కలెక్షన్స్ ని బీట్ చేస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: