నేడు విడుదల అయిన కల్కి 2898 ఏడి సినిమా టాక్ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. అసలు టిక్కెట్లు దొరకని పరిస్దితి ఏర్పడింది. ఇక నార్త్ ఇండియాలో అదే పరిస్దితి కనిపిస్తుంది ఇప్పుడు. విడుదల ముందు నుంచే అసలు అక్కడ బుకింగ్స్‌ గ్రాండ్‌గా షురూ అవుతున్నాయి. బుకింగ్స్ మొదలుపెట్టిన కొన్ని గంటలకే ఈ మూవీ నేషనల్‌ బెల్ట్‌లో హిందీ వెర్షన్ టిక్కెట్స్‌ భారీగా అమ్ముడయ్యి సూపర్ రికార్డ్ క్రియేట్ చేసింది. కల్కి 2898 ఏడీకు ఈ రేంజి క్రేజ్ నార్త్ లో ఉంటుందని అస్సలు ఎక్సపెక్ట్ చేయలేదు. ఈరోజు విడుదల అయ్యాక కూడా సినిమా సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మధ్య హిందూ దేవుళ్ళ మూలాలకు సంబంధించిన సినిమాలు నార్త్ లో ఒక రేంజ్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలకు నార్త్ ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు.బాహుబలి' సినిమా నార్త్ లో ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


అంత పెద్ద విజయం సాధించిన తర్వాత ప్రభాస్ కు అక్కడ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి ప్రభాస్ నటించిన చిత్రాలు అన్ని కూడా హిందీ బెల్ట్ లో టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నాయి. అందుకే ఇప్పుడు 'కల్కి 2898 AD' సినిమాపై మొదటి నుంచీ ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు. ప్రభాస్ తో పాటుగా ఈసారి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే ఇంకా దిశా పటానీ లాంటి బాలీవుడ్ స్టార్స్ యాడ్ అవ్వడం మరింత ప్లస్ అయింది. అనుకున్నట్టు గానే కల్కి టాక్ నార్త్ ఇండియాలో మాములుగా లేదనే చెప్పాలి. ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాడు.ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా ఇండియన్ టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: