చాలాకాలం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి రానే వచ్చింది. నాగ్‌ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ ప్రధాన పాత్రలో పోషించిన క‌ల్కి  మూవీ నేడు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి వాళ్లు కూడా కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రంలో చాలామంది ఇతర హీరో హీరోయిన్లు కూడా గెస్ట్రోల్స్ లో కనిపించారు. ఇప్పటికీ హీరోలు ఎవరెవరు ఉన్నారనేది చూసాం.

ఇక ఇప్పుడు ఈ మూవీలో ఎవరెవరు హీరోయిన్లు కనిపించారనేది ఒకసారి పరిశీలిద్దాం. దీపిక పదుకొనే ఈ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈమె ఈ మూవీలో సుమైటీ అలియాస్ సుమతి అనే పాత్రలో నటించింది. కైరా అనే పాత్రలో మలయాళ హీరోయిన్ అన్నా బెన్ కనిపించింది. ఇక ఉత్తర పాత్రలో మలయాళ హీరోయిన్ మాళవిక నాయర్ నటించింది. ఇక ప్రభాస్తో కాసేపు ప్రేమాయణం నడిపే రాక్సీ అనే పాత్రలో దిశా పటాన్ని కనిపించడం జరిగింది.

అదేవిధంగా ఒకప్పటి హీరోయిన్ శోభన మరియం అనే పాత్రలో కనిపించింది. ఇక జాతి రత్నాలు సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ఒక చిన్న పాటలో అలా మెరిసి ఇలా మాయమైపోయింది. బుజ్జి అనే ఒక గాడ్జెట్ కే కీర్తి సురేష్ వాయిస్ అందించింది. అలా మొత్తం మీద ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు మెరిశారు. కానీ ముందుగా అనౌన్స్ చేసిన హీరోయిన్లు దీపికా పదుకొనే అండ్ దిశా పటాని మాత్రంమే. వీరిద్దరూ మాత్రమే ఉంటారని చాలామంది భావించారు. కానీ ఈ సినిమాలో ఏకంగా ఆరుగురు ముద్దుగుమ్మలు కనిపించేసరికి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ప్రస్తుతానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. నాగ్‌ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ ప్రధాన పాత్రలో పోషించిన క‌ల్కి  మూవీ నేడు రిలీజ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: