ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ఈ రోజున చాలా గ్రాండ్ గా విడుదల అయింది. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతోంది. టికెట్ ధరలు కూడా భారీగా పెరిగినప్పటికీ.. ఎక్కడ అభిమానులు తగ్గకుండా ఈ సినిమాని చూడడానికి మక్కువ చూపుతున్నారు. అయితే ఇందులో మహాభారతానికి సంబంధించి లింకప్ ఉండడంతో కథ మంచి హైప్ ఏర్పడింది. అంతేకాకుండా భారీ బడ్జెట్ సినిమాతో పాటు.. భారీ క్యాస్టింగ్ ఉండడంతో ఈ సినిమాకి మరింత కలిసి వచ్చింది.


ముఖ్యంగా కల్కి సినిమాలో దీపికా పదుకొనే అద్భుతంగా నటించిందని వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే ప్రభాస్ దిశాపటాని మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు కాంప్లెక్స్ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఉపయోగించుకున్నట్లుగా కనిపిస్తోంది. లవ్ ట్రాక్ లో వంటి సీన్లు బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. శోభన, పశుపతి ,అనాబెల్ తదితరులు  నటీనటులు ఓకే అయినప్పటికీ కథలో భాగంగా వాళ్ళ పాత్రలు బాగానే ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ , మాళవికా నాయర్, రాంగోపాల్ వర్మ, రాజమౌళి, ఫరియా అబ్దుల్లా, కె.వి అనుదీప్, అతిది పాత్రలో కనిపించారు. వర్మ రాజమౌళితో ప్రభాస్ సీన్లు కాస్త నవ్వించేలా కనిపిస్తున్నాయి మిగతా పాత్రలు పెద్దగా ఇన్ఫెక్ట్ చూపించలేదని సమాచారం.


కల్కి 2898AD చిత్రం ఒక్క మాటలో చెప్పాలంటే విజువల్ వండర్ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇందులో కథ చెప్పలేదు.. ప్రేక్షకులకు ఒక్క సారిగా కొత్త ప్రపంచాన్ని అందులో ఉండే పాత్రలను మాత్రమే పరిచయం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పరిచయం కాస్త నిదానంగా సాగిన చివరి అరగంట ప్రేక్షకులకు సైతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నది. జస్ట్ గో అండ్ వాచ్ సినిమాలా శంబల ప్రజల నుంచి రేపటి కోసం అనే మాట ఎక్కువగా వినపడుతోంది.. మరి నాగ్ అశ్విన్ రేపటి తన సినిమాల కోసం కథను దాచార.. లేకపోతే జస్ట్ విజన్ మాత్రమే పరిచయం చేశారా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. సినిమాలో కథ లేకపోయినా మెస్మరైజ్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు.. మొత్తానికి సీక్వెల్లో పూర్తి కథని ముగించేలా ప్లాన్ చేశారేమో అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: