కల్కి 2898 AD సినిమా నేడు విడుదలయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కేవలం మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ కొన్ని రోజులుగా సినీ ప్రియులు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్‌కీ, 'కల్కి' సినిమాని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో అశ్విన్ దత్ నిర్మాణంలో అతని అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఇది. సైన్స్‌ ఫిక్షన్, హిందూ పురాణాలు, భవిష్యత్‌ కాలం, అగ్ర తారాగణం... మేళవింపుగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకర్షించింది.  ఈ సినిమాలో చాలా అంశాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో కీలకమైన ఓ పాత్రగా కనిపించే బుజ్జి కార్‌ కోసమే రూ.6 కోట్లు పైగా ఖర్చు చేశారు. అందుకు తగ్గట్లుగా ఆ కార్ ఆకట్టుకుంటుంది. ఈ బుజ్జి కార్‌కి అగ్ర కథానాయిక కీర్తి సురేశ్‌ గొంతునిచ్చారు. ఇంకా ఈ సినిమా కోసం భవిష్యత్‌ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల్ని సృష్టించారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.


నిజంగా అందుకే ఇతనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలోనే ఈ సినిమా కథ మొత్తం కూడా సాగుతుంది. తారాగణం పరంగా కూడా ఎన్నో విశేషాలున్న చిత్రమిది. అశ్వత్థామగా నటించిన అమితాబ్, సుప్రీం యాస్కిన్‌ పాత్రని పోషించిన కమల్‌హాసన్‌ దాదాపు 39 ఏళ్ల విరామం తర్వాత కలిసి ఈ సినిమాలో ఎంతో నటించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె నటించిన తొలి తెలుగు చిత్రమిదే. అయినా కానీ చాలా సెటిల్ గా నటించి ఆకట్టుకుంది.శోభన, దిశా పటానీ, మాళవిక నాయర్‌ తదితరులు కీలక పాత్రలని కూడా నాగ్ అశ్విన్ బాగా చూపించాడు. శంభాల నగరాన్ని చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ఈ సినిమా యొక్క విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని పెంచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: