స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటులు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, అన్నా బెన్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, మాళవిక నాయర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, శోభన, దిశా పటాని వంటి ప్రముఖులు కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమాని రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్విని దత్ నిర్మించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాని భారతీయ చలనచిత్ర చరిత్రలోనే తొలిసారిగా బలమైన క్యాస్టింగ్, టెక్నాలజీ విఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లతో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతుంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 4 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు.


అంతేకాకుండా విదేశాల్లోనూ 4500కు పైగా థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అయింది. ఇక ఈ సినిమాలో యానిమేషన్ అద్భుతంగా ఉందని ఆడియన్స్ చెబుతున్నారు. అంతేకాకుండా ప్రభాస్ లుక్ అదిరిపోయిందని, బుజ్జి రోల్ బాగుందని అంటున్నారు. ఇది కల్కి కాదు బుజ్జి అండ్ భైరవ సూపర్ హిట్ సినిమా అని ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే నాగ్ అశ్విన్ ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో తాను అరిగిన చెప్పులతో దాదాపు ఐదేళ్లు గడిపానని చెప్పకనే చెప్పేశారు.

సినిమా కోసం దాదాపు ఐదేళ్లపాటు కష్టపడ్డానని దానికి తగిన ప్రతిఫలం లభించిందని పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వగా....ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజెన్స్ డైరెక్టర్ డెడికేషన్ చూసి హ్యాట్సాఫ్ అంటున్నారు. కాగా, ఈ సినిమా కోసం మూవీ టీం అంతా దాదాపు ఐదేళ్లపాటు శ్రమించి ఈ సినిమాని ఈ రోజున రిలీజ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి బహుమానాన్ని ఇచ్చారు. ఇక ఈ సినిమాని చూస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: