రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ రోజు అనగా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ దక్కింది. దానితో ఈ మూవీ కి ప్రీమియర్ షో స్ తో పోలిస్తే మార్నింగ్ షో స్ కి కలెక్షన్స్ పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావడంతో మరో రెండు , మూడు రోజులు కూడా ఈ మూవీకి థియేటర్స్ లలో హౌస్ ఫుల్ బోట్స్ పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో చాలా మంది క్రేజ్ ఉన్న నటీనటులతో పాటు కొంత మంది దర్శకులు కూడా కొన్ని సీన్లలో కనిపించారు. అందులో భాగంగా ఈ సినిమాలో ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఓ గెస్ట్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సన్నివేశంలో తన బుజ్జి వెహికల్ లో స్పీడ్ గా వెళుతున్న సందర్భంలో ఓ బండి తనను డాష్ కొడుతుంది. దానితో అతను పక్కకు తిరిగి ఎవరో డాష్ కొట్టింది అని చూస్తాడు. దానితో పక్క వెహికల్ లో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఉంటాడు.

ఇక వారిద్దరి మధ్య కొంత ఘాటు సంభాషణ జరుగుతుంది. అలాంటి సమయంలో ప్రభాస్ ఇతనికి చెక్కితే ఐదు సంవత్సరాలు వదిలి పెట్టడు అని అంటాడు. ఆ తర్వాత ఎలాగోలాగా అతనిని తప్పించుకొని ప్రభాస్ వెళ్లిపోతాడు. దానితో రాజమౌళి ఈ సారి నువ్వు చిక్కితే పది సంవత్సరాలు కూడా నిన్ను వదిలి పెట్టను అనే డైలాగ్ కొడతాడు. ఇదంతా కూడా రాజమౌళి ఒక సినిమా తీస్తే దాని కోసం అత్యధిక సమయం తీసుకుంటాడు అనే విషయం మనకు తెలిసిందే. బాహుబలి సినిమా కోసం చాలా సమయం ప్రభాస్ కేటాయించాడు. ఇక మరో సినిమా కనక చేస్తే 10 సంవత్సరాల టైం తీసుకుంటాను అని ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లే తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: