సింగర్‌ సునీత సినిమాల్లో మాత్రమే కాకుండా స్టేజ్‌ షోల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈమద్య కాలంలో సినిమాల్లో కంటే ఈమె స్టేజ్‌ షోలకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ఏ  రంగంలో ఉండే వారి మధ్యనైనా మనస్పర్ధలు, ఈర్ష్య, అసూయ వంటివి అత్యంత సహజం. వీటిలో వారంతట వారు తెచ్చుకున్న గొడవలు కొన్నయితే, ఏం లేకుండా పుకార్లు, చెప్పుడు మాటలతో విభేదాలు కొన్ని.స్వతహాగా గ్లామర్ ఫీల్డ్ అయిన చిత్ర పరిశ్రమలోనూ వివాదాలు ఎన్నో. నాటి బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో నటీనటులు, దర్శక నిర్మాతల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. కాలం ఎంతటి గాయాన్ని అయినా మాన్పుతుంది అన్నట్లు ఈ మనస్తాపాలు చల్లారిపోయేవి. కానీ కొందరు మాత్రం తమ జీవితాంతం వాటిని గుర్తుపెట్టుకుని.. తను మనశ్శాంతిగా ఉండకపోగా.. ఎదుటి వ్యక్తికి ప్రశాంతతను దూరం చేస్తుంటారు.

ఈ సంగతి పక్కనబెడితే.. తెలుగు నాట మహిళా గాయకుల్లో స్టార్ స్టేటస్‌ను పొందిన వారిలో సునీత ఒకరు. అద్భుతమైన సౌందర్యం, మత్తెక్కించే వాయిస్‌తో ఈమె ఒక తరం కుర్రాళ్లకు నిద్రలేకుండా చేశారు. '' ఈ వేళలో నీవు '' అనే పాటతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సునీత లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కేవలం గాయనీగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా , నటిగా , యాంకర్‌గా రాణిస్తున్నారు. వీరి ఇంట్లో అంతా సంగీతానికి సంబంధించిన వారే కావడంతో అదే వారసత్వం సునీత అందిపుచ్చుకున్నారు.ఈటీవీలో దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా దశాబ్ధాల పాటు తెలుగువారిని అలరించిన పాడుతా తీయగా షో ఎందరో గాయనీ గాయకులను వెండితెరకు పరిచయం చేసింది. ఇదే వేదిక నుంచి కేవలం 15 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చారు సునీత. వరుస మ్యూజికల్ హిట్లతో , మెస్మరైజింగ్ వాయిస్‌తో ఛాన్స్‌లు కొట్టేశారు. తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రీయా, భూమిక, మీరా జాస్మిన్ , సోనాలి బింద్రే వంటి స్టార్ హీరోయిన్లకు గాత్రదానం చేశారు.

అలా కేవలం 8 ఏళ్ల కాలంలోనే దాదాపు 500 సినిమాలకు డబ్బింగ్ చెప్పారంటే సునీత ఏ రేంజ్‌లో బిజీగా ఉండేవారో అర్ధం చేసుకోవచ్చు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో వేలాది పాటలు పాడారు.సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సునీత.. ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే నాటి స్టార్ యాంకర్ ఉదయభానుతో మనస్పర్ధల గురించి సునీతను యాంకర్ ప్రశ్నించారు.

అంతకుముందే ఉదయభాను ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ స్టార్ సింగర్ తనను అమెరికాలో జరిగిన ఈవెంట్‌లో అవమానించిందని చెప్పుకొచ్చారు. స్టేజ్ మీదకు పిలవలేదని, తాను వేదిక మీదకు వెళ్తుంటే ఈ సింగర్ తాలూకా ఆర్కెస్ట్రా వాళ్లు శాడ్ మ్యూజిక్ ప్లే చేశారని దీంతో తనకు కన్నీళ్లు ఆగలేదని ఉదయభాను ఎమోషనల్ అయ్యారు.ఆ ప్రముఖ సింగర్ సునీతేనంటూ తర్వాత మీడియాలో , సోషల్ మీడియాలో ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో సునీత స్పందించారు. తను నన్ను అపార్ధం చేసుకుందని.. అమెరికాలో జరిగిన షో నా ప్రోగ్రామ్ అని.. అయినా భానుని తాను ఏం అనలేదని చెప్పారు. ఉదయభానుని ఆ షో ఆర్గనైజర్లు హోస్ట్‌గా పిలిచారని, ఇందులో తనకు ఏమాత్రం సంబంధం లేదని.. అలాంటప్పుడు స్టేజ్ మీదకు రమ్మని నేనెందుకు చెబుతానని సునీత ప్రశ్నించారు.

నా మ్యూజిక్ టీమ్ ఉదయభాను వస్తుంటే విషాద సమయంలో మ్యూజిక్ వాయించినట్లుగా నాకు గుర్తు లేదని.. ఈ సంఘటన తర్వాత చాలా సార్లు తాను ఉదయభానుని పలకరించినా ఆమె చాలా కోపంగా చూసేదని సునీత క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఆ షో ఈ ఇద్దరి మధ్య బాగా దూరాన్ని పెంచిందన్నది మాత్రం సుస్పష్టం. కానీ పెంచుకుంటూ పోతే బంధం తెగిపోతుంది.. సునీత పలకరించినప్పుడు ఉదయభాను నవ్వుతూ రియాక్ట్ అయివుంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: