కొంత మంది వ్యక్తులకు తాము చేసే పని పట్ల ఎంతో గౌరవం ఉంటుంది. అలాగే వారు చేసే పనిలో విజయం సాధించడం కోసం ఏ స్థాయిలో అయిన కష్టపడడానికి కొంత మంది రెడీ గా ఉంటారు. ఇక వారి కష్టం ఫలించి చివరిగా వారు విజయం సాధించిన సమయంలో ఎంతో మంది వారిని ప్రశంసిస్తూ ఉంటారు. ఇలా తాజాగా నాగ్ అశ్విన్ కూడా తన కష్టానికి ఫలితాన్ని అందుకున్నాడు. నాగ్ అశ్విన్ , నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టాడు.

మూవీ ద్వారా ఈయనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈయన మహానటి అనే సినిమాకు దర్శకత్వం వహించి మరో విజయాన్ని అందుకున్నాడు. మహానటి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఈయన తాజాగా ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా జూన్ 27 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇలాంటి సమయంలో తాజాగా నాగ్ అశ్విన్మూవీ కోసం తాను పడిన కష్టాన్ని తెలియ జేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ చేశాడు. అందులో భాగంగా ఈయన విరిగిన చెప్పుల ఫోటోను షేర్ చేస్తూ ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ సినిమా చేయడానికి చాలా ఏళ్లు కష్టపడ్డాం అని తెలిపారు. ఇలా తన కష్టాన్ని గురించి తెలియజేస్తూ పోస్ట్ చేసిన ఫోటోకు నెటిజెన్ ల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లను ఏ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: