తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుల లో నాగ్ అశ్విన్ ఒకరు . ఈయన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు . ఈ సినిమా డిఫరెంట్ కథాంశంతో రూపొంది విమర్శకులను మెప్పించింది . ఈ సినిమాతో నాగ్ అశ్విన్ కి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కకపోయినప్పటికీ ఒక గొప్ప దర్శకుడు అయ్యే క్వాలిటీస్ ఇతనిలో ఉన్నాయి అనే ప్రశంసలను మాత్రం బాగా అందుకున్నాడు . ఇలా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ప్రశంశలను అందుకున్న ఈయన ఆ తర్వాత మహానటి అనే సినిమాను తెరకెక్కించాడు.

సినిమా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో నాగ్ కి విమర్శకుల ప్రశంశలతో పాటు ప్రేక్షకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు. అలాగే కమర్షియల్ విజయాన్ని కూడా అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈయన ప్రభాస్ హీరో గా కల్కి 2898 ఏడి అనే సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించాడు.

ఆ తర్వాత కల్కి 2898 ఏ డి సినిమా అత్యంత భారీ గ్రాఫిక్స్ తో రూపొందబోతున్నట్లు వార్తల రావడంతో ఈయన అంతపెద్ద ప్రాజెక్టు హ్యాండిల్ చేయగలడా కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న వ్యక్తి హాలీవుడ్ స్థాయిలో సినిమాను తెరకెక్కించగలడా అని ఎంతో మంది అనుమానపడ్డారు. ఇక ఈ రోజు ఈయన దర్శకత్వం వహించిన కల్కి సినిమా విడుదల అయింది. ఈ మూవీ కి అద్భుతమైన టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాను ఈయన తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు , విమర్శకులు ఈయనపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాతో నాగ్ అశ్విన్ అద్భుతమైన స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: