తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు విడుదల అయ్యి అద్భుతమైన ప్రశంసలను తెచ్చుకుంటుంది. ఈ సినిమాను తెరకెక్కించిన విధానానికి నాగ్ అశ్విన్ పై ప్రపంచ స్థాయిలో ప్రశంశల వర్షం కురిపిస్తుంది. దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి ఈ సినిమాపై కష్టపడిన నాగ్ కి ఈ మూవీ ద్వారా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీ అనౌన్స్ చేసిన సమయంలో మాత్రం నాగ్ అశ్విన్ పై పెద్దగా ఎవరు నమ్మకం పెట్టుకోలేదు.

ఎందుకు అంటే నాగ్ అశ్విన్ "ఎవడే సుబ్రహ్మణ్యం" అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ కి ప్రశంసలు దక్కినప్పటికీ కమర్షియల్ గా భారీ సక్సెస్ ను ఈ మూవీ చూడలేదు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ "మహానటి" అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది. కాకపోతే ఈ సినిమాలో సెట్స్ మినహాయిస్తే పెద్దగా గ్రాఫిక్స్ ఏమీ ఉండదు.

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే అత్యంత అద్భుతమైన స్థాయి కలిగిన ఎంతోమంది నటీనటులు ఈ సినిమాలో భాగం కావడం , అలాగే హాలీవుడ్ స్థాయిలో ఈ మూవీ లో గ్రాఫిక్స్ ఉండబోతుంది అని వార్తలు రావడం , ఈ సినిమాకు వందల కోట్లలో బడ్జెట్ అవుతుంది అని తెలియడంతో ఇన్ని విషయాలను కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న వ్యక్తి హ్యాండిల్ చేయగలడా. గతంలో ఎంతో మంది ఎంతో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ డైరెక్టర్లు కూడా ఇలా భారీ బడ్జెట్ సినిమాలను స్టార్ కాస్ట్ తో తెరకెక్కించి చతికల పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆల సీనియర్సే చేయలేని పనిని రెండు సినిమాల అనుభవం ఉన్న వ్యక్తి చేయగలుగుతాడా... ఇది సాధ్యం అవుతుందా అని అనుమానాలు ఈయనపై వ్యక్తం చేశారు. కానీ ఈయన ఆ అనుమానాలన్నింటినీ తుడిచిపెట్టి ఈ సినిమాతో అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: