మోస్ట్ అవైటెడ్ మూవీ గా థియేటర్లలోకి వచ్చిన సినిమా కల్కి.  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే అండ్ దిశా పటాని వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా నేడు అనగా జూన్ 27వ తారీకున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకి నాగ్ అశ్విన్ డైరెక్షన్ వహించగా అమితాబచ్చన్ మరియు కమల్ హాసన్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషించారు. దీంతో ఈ మూవీ పై మరిన్ని ఆశలు నెలకొన్నాయి.

భారీ అంచనాలను అందుకుంటూ ఈ మూవీ ప్రెసెంట్ థియేటర్లలో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటన ఒక ఎత్తు అయితే అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్ మధ్య జరిగే సన్నివేశాలు మరొక ఎత్తు. అయితే వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించి 39 ఏళ్లు అవుతుంది. 1985లో హిందీలో వచ్చిన ఓ సినిమాలో అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్ కలిసి నటించారు. ఇక మళ్లీ ఇన్నాళ్లకు కల్తీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించడం విశేషం. సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్హాసన్ నటించిన అశ్వద్ధామ పాత్రలో అమితాబచ్చన్ మెప్పించారు. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొనే అండ్ దిశా పటాని మరియు రాజేంద్రప్రసాద్, శోభన తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

ఇక ఈ మూవీకు సంతోష్ నారాయణ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భార్య బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ మూవీ కి ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇదే రివ్యూలు కొనసాగితే ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో భైరవ అనే పాత్రలో ప్రభాస్ తన నటనతో మెప్పించాడు. సాలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం అనంతరం ప్రభాస్ చేసిన సినిమా నే కల్కి. ఇక ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో తన తదుపరి చిత్రాలపై ఫుల్ హైప్స్ నెలకొన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ విధమైన కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: