రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కెరియర్ ప్రారంభంలో ప్రభాస్ నటించిన సినిమాలలో డైరెక్టర్లు కాస్త కామెడీ ప్రయత్నించేవారు. ఆయన కూడా ఆ సమయంలో కామెడీ బాగానే చేసేవాడు. ఇక రాజమౌళి , ప్రభాస్ తో బాహుబలి మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ ఒకటి , రెండు సన్నివేశాలలో మినహాయిస్తే అంతా కూడా చాలా సీరియస్ గా ఉంటాడు.

ఇక ఆ తర్వాత ప్రభాస్ నటించిన శాహో సినిమాలో కూడా ఒకటి , రెండు కామెడీ సన్నివేశాలు మినహాయిస్తే అంతా చాలా సీరియస్ గానే ఉంటాడు. ఇక రాదే శ్యామ్ సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రభాస్ లవర్ బాయ్ పాత్రలో నటించాడు. ఈ మూవీ లో కూడా ఈయన ఎక్కువ శాతం సీరియస్ గానే ఉంటాడు. ఇక కొంత కాలం క్రితమే ప్రభాస్ "సలార్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ సినిమాలో అసలు ప్రభాస్ కామెడీ జోలికి వెళ్లలేదు. అవుట్ అండ్ అవుట్ సీరియస్ పాత్రలోనే కనిపించాడు. యాక్షన్స్ సన్నివేశాలకు పైనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు.

ఇలా వరుసగా సీరియస్ పాత్రలలో నటిస్తూ రావడంతో ప్రభాస్ అభిమానులు ఆయన నుండి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే కల్కి సినిమా కూడా సీరియస్ కథతోనే ఉంటుంది అని మొదటి నుండి వార్తలు రావడంతో ఈ సినిమాలో కూడా కామెడీ ఉండదు అని చాలా మంది డిసైడ్ అయ్యారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ చాలా కామెడీని పండించాడు. అసలు ప్రభాస్ ఎంట్రీ తోనే ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ నవ్వులు పోయించాడు. అలాగే బ్రహ్మానందం, రామ్ గోపాల్ వర్మ, ఎస్ ఎస్ రాజమౌళి తో కూడా ప్రభాస్ కామెడీని పండించాడు. ఇలా ప్రభాస్ ఈ సినిమాలో చాలా సన్నివేశాలలో కామెడీ పండించడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనంద పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: