పొన్నియన్‌ సెల్వన్‌' చిత్రంతో సెకండ్‌ ఇన్సింగ్స్‌లో విజయాల బాట పట్టింది సీనియర్‌ కథానాయిక త్రిష. ఇరవైఏళ్లకుపైగా కెరీర్‌లో కొనసాగుతున్న ఈ అమ్మడు ఇప్పటికీ వన్నె తరగని అందంతో అలరారుతున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో అరడజనుకుపైగా సినిమాలున్నాయి.నయనతార ఇప్పుడు డేట్స్ ఇస్తే చాలు అనుకునే స్టార్ స్టేటస్‌ని సంపాదించుకున్నా.. కెరీర్ ప్రారంభంలో మాత్రం సెకండ్ హీరోయిన్ రోల్స్ కూడా చేసింది. చాలా కష్టపడింది. అప్పుడు కష్టపడింది కాబట్టే.. ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తుంది. గ్లామర్ హీరోయిన్ నుంచి.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే స్థాయికి చేరింది. అలాగే కోలీవుడ్ దర్శకుడిని పెళ్లాడిన ఈ కేరళ బ్యూటీ.. ఇటీవల కవల పిల్లలకు తల్లిగా మారింది. అయినా కూడా సినిమాలు మాత్రం చేస్తూనే ఉంది.హీరోయిన్లు త్రిష,నయనతార మధ్య విభేదాలు వచ్చాయా..? ఇద్దరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉందా..? అసలుఇద్దరికి గొడవ ఎక్కడ వచ్చింది. ఈ విషయంలో నిజం ఒప్పుకున్న త్రిష ఏమని క్లారిటీ ఇచ్చింది..?ఫిల్మ్ ఇండస్ట్రీలో.. మరీ ముక్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాలుగు పదులు దాటినా.. ఇంకా గ్లామర్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో త్రిష, నయనతార ముందు ఉన్నారు. త్రిష 40 ఏళ్లు వయస్సు దాటగా..

నయనతార 40కి అడుగు దూరంలో ఉంది. అయితే ఈ ఇద్దరు తారలు సౌత్ లో స్టార్ హీరోయిన్లు గా వెలుగు వెలిగారు. ఆల్ మోస్ట్ స్టార్ హీరోల సరసన మెరిసారు. ఇప్పటికీ హీరోయిన్లు గా కొనసాగుతూ..తమ సత్తా చాటుతున్నారు. రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే వసూలు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య గొడవలు ఉన్నట్టు ఎప్పటినుంచో ఇండస్ట్రీలో న్యూస్ హల్ చల్ చేసింది. ఇద్దరి మధ్య వైరం గట్టిగా ఉన్నట్టు టాక్.ఉత్తుత్తి మాట కాదు... నిజంగానే వీరిమధ్య గొడవలు ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా త్రిష ఓ సందర్బంలో ఒప్పుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
1999లో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చింది త్రిష. దాదాపు 25 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: