నాలుగేళ్లుగా ఎట్ట‌కేల‌కు ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌ల్కి సినిమా ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా ? అని అస‌లు ఇండియ‌న్ సినిమా ప్రేక్ష‌కులు కోట్లాది మంది వెయిట్ చేస్తూ వ‌స్తున్నారు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన క‌ల్కి సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. సినిమా క‌థ బాగుంద‌ని అంద‌రూ చెపుతున్నా... క‌థ‌నం మీద కొన్ని డౌట్లు ఉన్నా కూడా సినిమా ఓ విజువ‌ల్ వండ‌ర్ అని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకుంటున్నారు.


ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే మ‌హాభార‌త యుద్ధంతో ఈ క‌థ‌ మొద‌ల‌వుతుంది. అశ్వ‌ద్ధామ‌కు శ్రీ‌కృష్ణుడు శాపం ఇస్తాడు. దీనికి శాప విమోచ‌న లేదా అని అశ్వ‌ద్ధామ శ్రీ కృష్ణుడిని వేడుకుంటాడు. కృష్ణుడు శాంతిస్తాడు. ఆ త‌ర్వాత క‌లియుగంలో `క‌ల్కి`గా మ‌ళ్లీ అవ‌త‌రిస్తాన‌ని, అప్పుడు త‌న‌ని కాపాడాల‌ని, దాంతో శాప‌విమోచ‌న క‌లుగుతుంద‌ని చెపుతాడు. ఆ త‌ర్వాత క‌ల్కి క‌థ క‌లియుగంలో స్టార్ట్ అవుతుంది. ప్ర‌పంచం అంతా నాశ‌నం అయిన వేళ ఈ భూమి మీద మిగిలిన చివ‌రి న‌గ‌రం కాశీ ఉంటుంది.


అక్క‌డ ఉంటే ప్ర‌జ‌ల బ‌తుకులు అన్నీ చాలా దుర్భ‌రంగా ఉంటాయి. ఎక్క‌డ చూసినా ఇసుకే క‌నిపిస్తుంది. మొక్క కూడా మొల‌వ‌ని వాతావ‌ర‌ణం ఉంటుంది. అక్క‌డ ఉన్న సౌంద‌ర్యం, విలాస‌వంత మైన జీవితం అంతా పైన ఉన్న కాంప్లెక్స్ లాగేసుకుంటూ ఉంటుంది. ఆ కాంప్లెక్స్‌ను యాస్కిన్ (క‌మ‌ల్ హాస‌న్‌) అధీనంలో ఉంటుంది. మ‌ర‌ణం లేకుండా ఎప్ప‌టికీ బ‌తికే ఉండాల‌న్న‌ది యాస్కిన్ కోరిక‌. అయితే కాశీలో ఉండే భైర‌వ (ప్ర‌భాస్‌) ఆ కాంప్లెక్స్ లోకి అడుగు పెట్టాల‌ని.. అందుకోసం యూనిట్స్ సంపాదించాల‌ని ట్రై చేస్తూ ఉంటాడు.


ఇక కాంప్లెక్స్‌ను శాసించే యాస్కిన్ త‌న‌కు మ‌ర‌ణం లేకుండా ఉండేందుకు గ‌ర్భ‌వ‌తుల సిర‌మ్‌ని తన శ‌రీరంలోకి ఇంజెక్ట్ చేయించుకుంటూ ఉంటాడు. ఆ కాంప్లెక్స్‌లో 90 రోజుల పాటు గ‌ర్భం మోసే ఏ శ‌క్తి ఆడ‌పిల్ల‌ల‌కు ఉండ‌దు. అలాంటి గ‌ర్భ‌వ‌తి కోస‌మే యాస్కిన్ త‌న అన్వేష‌ణ కొన‌సాగిస్తోన్న టైంలో దీపికా ప‌దుకునే 150 రోజుల పాటు గ‌ర్భం మోస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌ప్పించుకుంటుంది. ఇక సినిమా చివ‌ర్లో ఆమె కోసం యాస్కిన్ స్వ‌యంగా అన్వేష‌ణ ప్రారంభించి బ‌య‌లు దేర‌తాడు. ఈ సీరిమ్‌లో ఉన్న సీక్రెట్ ఏంటి ? క‌ల్కి అవ‌తారం ఎప్పుడు, ఎలా సంభ‌వించింది? అనేది మిగిలిన క‌థ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: