కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే టైటిల్ లో 2898 అర్థం ఏమిటో తెలుసుకోడానికి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. మన హిందూ పురాణాల ప్రకారం.. కలియుగం అనేది 4 లక్షల 32 వేల సంవత్సరాలు ఉంటుంది. అయితే కలియుగంలో ధర్మం తప్పి.. అధర్మం పాలన సాగిస్తున్న వేళ.. ఏ నిమిషయంలో అయినా సరే.. శ్రీమహావిష్ణువు పదో అవతారం అయిన కల్కి భగవంతుడు వచ్చి.. ధర్మ సంస్థాపన చేస్తాడని మన పురాణాల్లో వర్ణించారు. ఇక పురాణాల ప్రకారం కలియుగం మొత్తం 4 లక్షలకు పైగా సంవత్సరాలు ఉంటే.. ఇప్పుడు వచ్చిన కల్కి మూవీలో దర్శకుడు ఎందుకు 2898 అనే సంవత్సరాన్ని డైరెక్టర్ ఎంచుకున్నాడు.. అయితే అందుకు గల కారణం ఏంటి అంటే.. పురాణాలు, వ్యాస భారతం ప్రకారం చూసుకుంటే కలియుగం ప్రారంభం అయ్యి ఇప్పటికి 5126 సంవత్సరాలు అవుతుంది. అంటే 5 వేల ఏళ్ల ముందు భారత చరిత్రలో కురుక్షేత్రం, ద్వాపరయుగం ముగింపు ఇంకా కలియుగం ఆరంభం అనేది జరిగింది. మన వ్యాస మహాభారతం, పురణాల ప్రకారం మహా భారత యుద్ధం జరిగింది 3138 బీసీఈ సంవత్సరంలో అట.అయితే యుద్ధంలో కౌరవులు చనిపోయి పాండవులు గెలిచారు. యుద్ధం ముగిసిన రాత్రి నిద్రపోతున్న ఉపపాండవులును అశ్వత్థామ నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు.


ఇక అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతి అని తెలిసి కూడా.. బ్రహ్మాస్త్రం ప్రయోగించడంతో.. ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోతాడు. దాంతో కోపంతో రగిలిపోయిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను 3 వేల ఏళ్ల పాటు దుర్గందంతో తిరుగుతూ ఉంటావని ఆ తర్వాత చిరంజీవిగా ఉంటావని శాపం ఇంకా వరం ఇచ్చాడు.అయితే ఇదే సమయంలో యుద్ధంలో దుర్యోదనుడు మరణించడంతో.. ఎంతో తీవ్ర ఆవేదనకు గురైన అతడి తల్లి గాంధారి.. శ్రీకృష్ణుడికి తీరని శాపం ఇచ్చింది. అసలు ఆయన తల్చుకుంటే యుద్ధం జరిగేది కాదని.. అయినా శ్రీ కృష్ణుడు ఆ పని చేయలేదని.. అందువల్ల తన 100 మంది కుమారులు చనిపోయారని ఆమె ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక అంతటితో ఆగక యుద్ధం ముగిసిన 36 ఏళ్ల తర్వాత శ్రీ కృష్ణుడి వంశం నాశనం అవుతుందని ఆమె శపిస్తుంది. అంటే గాంధారి శాపం ప్రకారం 36 ఏళ్ల తర్వాత.. అనగా 3102 బీసీఈలో కృష్ణావతారం ముగిసి.. కలియుగం ప్రారంభం అవుతుందని వ్యాస భారతం పేర్కొంది.కల్కిలో ఉన్న 2898 ఏడీకి, కలియుగం ప్రారంభమైన 3102 రెండింటిని కలిపితే 6 వేల ఏళ్లవుతుంది. 2898లో కలియుగాంతం సమీపిస్తోంది. ఆ సమయంలో భూమ్మీద ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీమహావిష్ణువు పదో అవతారం అయిన కల్కి దేవుడు భూమ్మీద జన్మిస్తాడు. దీని ఆధారంగానే నాగ్‌ అశ్విన్‌ కల్కి 2898 ఏడీ సినిమాని తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: