క‌ల్కి రిలీజ్‌కు ముందే బాగుంటుద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. అయితే అది ఎంత బాగుంటుంది అనే దానికోస‌మే ఈగ‌ర్‌గా జ‌నాలు వెయిట్ చేశారు. ఇక ఈ సినిమా క‌థ ప్రారంభంలో మ‌హాభార‌తం ముగింపుతో ఆరంభించేలా చేశాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌. ఇక ఈ సినిమా స్టోరీ విష‌యానికి వ‌స్తే... అశ్వద్ధామను శ్రీకృష్ణుడు శ‌పించ‌గా ప్రాయ‌చ్చిత్తం అడుగుతాడు. అందుకు కృష్ణుడు కలియుగంలో మళ్ళీ కల్కిగా అవతరిస్తా.. ఆ శిశువును నువ్వే కాపాడాల‌ని చెప్తాడు. ఇక క‌లియుగంలోకి వ‌స్తే సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) భూమిపై ఓ కిలోమీట‌ర్ దూరంలో ఉండే కాంప్లెక్స్ కి అధిపతి. తన కాంప్లెక్స్ లో అతను ఒక ఫెర్టిలిటీ ల్యాబ్ న‌డుపుతూ ప్ర‌యోగాలు చేస్తూ కొత్త వ‌ర‌ల్డ్ క్రియేట్ చేయాల‌ని అనుకుంటాడు. ఈ క్ర‌మంలోనే ఆడ‌వాళ్ల ప్రెగ్నెన్సీ సీర‌మ్‌తో టెస్టులు చేస్తూ ఉంటాడు. ఇటు భైరవ (ప్రభాస్) కాంప్లెక్స్ లో మంచి లైఫ్ ఎంజాయ్ చేయాల‌ని అనుకుంటూ ఉంటాడు. ఇక యాస్మిన్ నుంచి సుమ‌తి ( దీపికా ప‌దుకునే) ను కాపాడేందుకు అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) బయలుదేరతాడు. శంబాలాలో మరియం (శోభన) ఆమె మనుషులు సుమతి రాక కోసం వెయిటింగ్‌లో ఉంటాడు. సుమ‌తి గ‌ర్భంలో పెరిగే పిల్లాడికి అశ్వ‌ద్ధామ‌కు లింక్ ఏంటి ?  భైర‌వ ల‌క్ష్యం నెర‌వేరిందా ?  అశ్వ‌ద్ధామ శాపం తీరిందా ? యాస్కిన్ తను కలలు కన్న కొత్త ప్రపంచాన్ని సృష్టించగలిగాడా ? చివరికి ఏమైంది అన్న‌దే ఈ సినిమా.

ఫ్ల‌స్ పాయింట్స్ ( + )
- కాంప్లెక్స్ లోని ప్ర‌పంచం మ‌రో అద్భుత‌మైన విజువ‌ల్ వండ‌ర్‌. వాహ‌నాలు
- బుజ్జి వాహ‌నం
- అమితాబ్ అశ్వ‌ద్థామ పాత్ర‌
- క‌మ‌ల్ యాస్కిన్ పాత్ర‌
- క‌ళ్లు చెదిరిపోయే విజువ‌ల్స్‌
- సెకండాఫ్ ఎవెంజ‌ర్స్ టైప్ యాక్ష‌న్ ఘ‌ట్టాలు
- క‌ళ్లు చెదిరిపోయే క్లైమాక్స్‌
- పార్ట్ 2లో మ‌రింత విధ్వంసం జ‌ర‌గ‌బోతోంద‌న్న సంకేతాలు

మైన‌స్ పాయింట్స్ ( - )
- ప్ర‌భాస్ భైర‌వ పాత్ర స‌రిగా డిజైన్ చేయ‌లేక‌పోవ‌డం
- ఫ‌స్టాఫ్ భారీ ల్యాగ్‌
- 181 నిమిషాల సుధీర్ఘ‌మైన ర‌న్ టైం
- గెస్ట్ పాత్ర‌ల‌ను స‌రిగా ఎలివేట్ చేయ‌లేక‌పోవ‌డం

ఫైన‌ల్‌గా...
న‌త్త‌న‌డ‌క‌గా స‌రికొత్త ప్ర‌పంచం

మరింత సమాచారం తెలుసుకోండి: