సినీ పరిశ్రమలోకి ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది మొదటి సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఆ తర్వాత అదే స్థాయిలో విజయాలను అందుకొని కెరియర్ ను ముందుకు సాగించడంలో విఫలం అవుతుంటారు. కొంతమంది మాత్రమే మొదటి సినిమా కంటే కూడా రెండవ , మూడవ సీనియార్టీ పెరిగిన కొద్దీ సినిమాలతో మంచి విజయాలను అందుకుంటుంటారు.

ఇక ఆ కోవలోకే తాజాగా నాగ్ అశ్విన్ కూడా చేరెట్లు కనిపిస్తున్నాడు. ఈయన మొదటగా నాచురల్ స్టార్ నాని హీరో గా రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చిన భారీ మొత్తంలో ఈ సినిమా కలెక్షన్లను వసూలు చేయలేదు. ఈ సినిమా తర్వాత ఈయన మహానటి సినిమాకు దర్శకత్వం వహించాడు.

సినిమా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఈ చిత్రం కలెక్షన్లను కూడా బాగానే రాబట్టింది. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడి అనే మూవీ ని అనౌన్స్ చేశాడు. ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది.

మూవీ కి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ ట్రాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం ఖాయంగా కనబడుతుంది. ఇకపోతే ఈ దర్శకుడు కల్కి సినిమా అనౌన్స్ చేసిన సమయంలో ఇంత భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేయగలడా అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈయన ఈ సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేసి సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: