టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ - దీపికా ప‌దుకొనే జంట‌గా న‌టించిన సినిమా క‌ల్కి 2898 ఏడీ. టాలీవుడ్‌లోనే గొప్ప పేరున్న 50 సంవ‌త్స‌రాల పేరున్న వైజ‌యంతీ సంస్థ నిర్మించిన ఈ మైథలాజిక‌ల్‌, సైన్స్ ఫిక్ష‌న్ సినిమా ఎప్పుడో ఫిబ్ర‌వ‌రి 2020 లో ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. ఆ త‌ర్వాత మూడు సార్లు క‌రోనా వ‌చ్చింది... క‌రోనా పోయింది. అయినా కూడా క‌ల్కి థియేట‌ర్ల‌లోకి రాలేదు. అస‌లు క‌ల్కి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ? అని ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డా లేని ఆస‌క్తి నెల‌కొంది.


క‌ల్కి ఖ‌చ్చితంగా అదిరిపోతుంద‌ని.. రికార్డులు బ్రేక్ చేస్తుంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ చూసిన వారంతా క‌ల్కి దెబ్బ‌తో త్రిబుల్ ఆర్ రికార్డులు బ్రేక్ అవుతాయ‌ని.. స‌లార్ రికార్డులు ఉఫ్ మ‌ని ఊదేస్తుంద‌ని ఇలా చాలా లెక్క‌లు వేసుకున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ రోజు క‌ల్కి ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. మ‌న దేశంలో ఐదారు భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.


ఇక హైద‌రాబాద్ లో అయితే అన్నీ థియేట‌ర్ల‌లోనూ క‌ల్కి సినిమానే ఈ రోజు తెల్ల‌వారు ఝామున 4.30 గంట‌ల నుంచే ప్ర‌ద‌ర్శించేస్తున్నారు. క‌ల్కి దెబ్బ‌కు హైద‌రాబాద్ లో అయితే భారీగా ట్రాపిక్ ఝామ్ అయ్యింది. మూసాపేట శ్రీరాములు థియేట‌ర్లో సినిమా చూసేందుకు తెల్ల వారు ఝాము నుంచే హైద‌రాబాద్ లో థియేట‌ర్ల ద‌గ్గ‌ర పోటెత్తారు. దీంతో మెయిన్ రోడ్ అయిన శ్రీరాములు థియేట‌ర్ అటు ల‌క్షీక‌ళ - శ‌శిక‌ళ థియేట‌ర్ల ముందు భారీగా ట్రాపిక్ జామ్ కావ‌డంతో పాటు వాహ‌నాలు చాలా నెమ్మ‌దిగా క‌దిలాయి..


దీనికి తోడు వ‌ర్షం కూడా కంటిన్యూ గా కురుస్తూ ఉండ‌డం తో వాహ‌న‌దారుల‌తో పాటు ఆఫీసుల‌కు ... ప‌నుల‌కు వెళ్లే వారంతా ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. ఏదేమైనా ప్ర‌భాస్ క‌ల్కి మానియా దెబ్బ‌తో హైద‌రాబాద్ లోనే ట్రాపిక్ మామూలుగా జామ్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: