రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దేశ పటాని కీలక పాత్రలలో కమల్ హాసన్ విలన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ రోజు థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సూపర్ గా ఉండడం , మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది.

సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 8 వేలకు పైగా థియేటర్లలో విడుదల అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి కూడా అంత గొప్ప క్రేజ్ ఉన్న నటుడు ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నాడు అంటే ఆ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండి ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ వచ్చారు. ఇక ఈ రోజు ఈ సినిమా విడుదల అయింది. ఈ మూవీ లో కమల్ హాసన్ పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఈయన ఈ సినిమాలో చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర చేశాడు.

సినిమా మొత్తం మీద ఈయన పాత్ర మహా అయితే ఐదు నుండి పది నిమిషాల రన్ టైం లో మాత్రమే ఉంది. ఆ విషయంలో కాస్త ప్రేక్షకులు నిరుత్సాహ పడ్డారు. ఇకపోతే కల్కి రెండవ భాగంలో మాత్రం కమల్ పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కల్కి రెండవ భాగంలో కమల్ హాసన్ దాదాపు 90 నిమిషాల నడివి ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన ఐదు నుండి పది నిమిషాల రన్ టైమ్  ఉన్న పాత్ర చేస్తేనే అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఏకంగా 90 నిమిషాల పాత్ర చేస్తే దానికి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: