Breaking:  సుమారు 600 కోట్ల బడ్జెట్తో ప్రపంచవ్యాప్తంగా గురువారం అనగా నేడు విడుదలైన కల్కి చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. దీంతో ఈ మూవీ ని చూసేందుకు సినీ సెలబ్రిటీలు సైతం ఉత్సాహపడుతున్నారు. నాగ్ అశ్విన్ అద్భుతమైన డైరెక్షన్ కి పలువురు సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు కూడా. ఇక భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే అండ్ దిశా పటానీలు నటించారు.

అదేవిధంగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ప్రజెంట్ ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంటు ధియేటర్లలో సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే మూవీ నిర్మాతలకు సరికొత్త తలనొప్పి ఎదురయింది. తాము నిర్మించిన సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతో భారీ ఎత్తున సంతోషంలో మునిగి తేలుతున్న నిర్మాతలకు బిగ్ షాక్ ఎదురయింది.

కల్కి ఫుల్ మూవీ ఆన్లైన్ లో దర్శనం ఇవ్వడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఈ పరిణామంతో మూవీ టీం తో పాటు నిర్మాతలు అండ్ ప్రభాస్ ఫాన్స్ ఆందోళనలో పడ్డారు. పైరసీ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడే అవకాశం ఉండడంతో వారిలో ఆందోళన మొదలైంది. కల్కి చిత్రం మూవీ రూల్స్ తో పాటు పలు వెబ్సైట్ల‌లో స్ట్రీమ్ అవుతుంది. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీను ఆన్లైన్లో పెట్టిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ పైరసీని నిర్మాతలు ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఒకవేళ ఈ పైరసీని కనుక నిర్మాతలు ఇలానే వదిలేస్తే కలెక్షన్స్ పై ప్రభావం చూపించే అంశాలు పక్కాగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: