ప్రభాస్ ఈ మధ్య కాలంలో వరుసగా ఎక్కువ శాతం సీరియస్ పాత్రలలోనే నటిస్తూ వస్తున్నాడు. దానితో ఆయన అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా ప్రభాస్ ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తే బాగుంటుంది అని ఆశను కూడా వారు అప్పటి నుండో వెళ్లబోచ్చుతు వస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దానితో ప్రభాస్ ఇప్పట్లో కామెడీ సినిమాలో నటించడం కష్టమే కాస్త ఉంటే మారుతి సినిమాలోనే ప్రభాస్ నుండి కామెడీ ఉండొచ్చు అని చాలా మంది జనాలు ఫిక్స్ అయ్యారు. ఇకపోతే తాజాగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. నాగ్ ఈ మూవీ కంటే ముందు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలలో అక్కడ, ఇక్కడ కాస్త కామెడీ మినహాయిస్తే ఇవి రెండు కూడా సీరియస్ సినిమాలే. దానితో కల్కి సినిమాలో కామెడీ ఉంటుంది అని దాదాపుగా ప్రేక్షకులు ఎవరు పెద్దగా ఊహించలేదు.

కానీ అనుహంగా ఈ సినిమాలో నాగ్ కామెడీకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మరి ముఖ్యంగా ప్రభాస్ తో కామెడీ పండించడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇచ్చాడు. ఈ సినిమాలో చాలా మంది నటులతో ప్రభాస్ కామెడీని పండించాడు. ముఖ్యంగా ఈయన ఎంట్రీ సీన్ లో కూడా బుజ్జి అనే వెహికిల్ తో సాగే సంభాషణతో కామెడీగానే ఉంది. ఇది కూడా ప్రేక్షకులను బాగానే నవ్వించింది. ఇలా ఇంత సీరియస్ కథలో కామెడీ పెట్టడం మాత్రమే కాకుండా దానితో ప్రేక్షకులను బాగానే అలరించడంలో నాగి ఫుల్ గా సక్సెస్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: