టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,యంగ్‌ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్లో రు. 600 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో వైజ‌యంతీ మూవీస్ అధినేత చ‌ల‌సాని అశ్వనీద‌త్ నిర్మించిన కల్కి 2898 ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు పాన్ ఇండియా భాష‌ల్లో రిలీజైన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరో కావడం, ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమా స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్‌ సినిమా తీయడం, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో ట్రైలర్స్ ఉండడం.. ఇటు పురాణాల‌ను... సైన్స్‌ను మిక్స్ చేసిన స‌బ్జెక్ట్ కావ‌డంతో అస‌లు సినిమా ఎలా ఉంటుందా ? అని మామూలు ఆస‌క్తి కాదు.


ఇక హిందూ పురాణాల్లోని చాలా అంశాల‌తో పాటు అటు మ‌హా భార‌త యుద్ధం ముగుస్తున్న టైంలో శ్రీ కృష్ణుడు అశ్వ‌ద్థామ‌ను శ‌పించ‌డం.. ఆ శాపం విముక్తి కోసం క‌లియుగంలో శ్రీ కృష్ణుడు క‌ల్కి అవ‌తారంలో జ‌న్మించ‌డం... ఆ బాలుడిని కాపాడేందుకు అశ్వ‌ద్ధామ అమితాబ్ పోరాటం చేయ‌డం.. అస‌లు ఇది ఊహ‌కే అంద‌ని థ్రిల్లింగ్‌గా ఉంది. దీనిని తెర మీద చూస్తుంటే.. సెకండాఫ్‌లో అయితే గూస్ బంప్స్ మోత మోగిపోతూ ఉంటుంది.


ఫ‌స్టాఫ్‌లో సినిమా కాస్త ల్యాగ్ అయిన‌ట్టు స్లోగా ర‌న్ అవుతుంటుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ తో సినిమాపై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరుగుతాయి. ఇక సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక ఓ 20 నిమిషాలు వ‌దిలేస్తే అక్క‌డ నుంచి దుమ్మ దులుపుకుంటూ పోతుంది.. క్లైమాక్స్ లో ఆఖ‌రు 20 నిమిషాలు థియేట‌ర్ల‌లో విజిల్స్ మోత మోగించేసిన నాగ్ అశ్విన్ సెకండాఫ్ పై ఆస‌క్తి పెంచేలా చేశారు. క్లైమాక్స్ వేరే లెవ‌ల్ అని అంద‌రూ ఒక్క‌టే ప్ర‌శంసిస్తున్నారు. క్లైమాక్స్ సెకండ్ పార్ట్ పై మ‌రింత ఆస‌క్తి పెంచేలా ఉంద‌ని అంటున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ కాస్త తక్కువ టైమే తెర‌మీద కనిపించినా.. ఇంట‌ర్వెల్ త‌ర్వాత ఒక్కో సీన్ హాలీవుడ్ రేంజ్ లో ఉందని.. ఇప్పుడు సినిమా చూసేయాల‌న్న‌ట్టుగా ఆస‌క్తి క‌లుగుతోంద‌న్న కామెంట్లు ప‌డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: