ప్రపంచ దేశాలు టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాయంటే రాజమౌళి నే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన తీసిన సినిమాలు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తం గా ఎంతో మంది సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. అయితే అలాంటి పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ని ఢీ కొట్టేవారు టాలీవుడ్ లో లేరు అనుకుంటే సుకుమార్, సందీప్ రెడ్డి వంగా కొత్తగా నాగ్ అశ్విన్ కూడా పుట్టుకొచ్చారు. అయితే తాజాగా కల్కి సినిమా లోని ప్రభాస్ పాత్ర గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ప్రభాస్  తో రాజమౌళి చేయించాల్సిన పాత్ర ని  ముందుగానే నాగ్ అశ్విన్ తన సినిమా లో చేయించేశారు అంటూ ఒక వైరల్ న్యూస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ..మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకు వచ్చారు రాజమౌళి. అయితే తన డ్రీమ్ ప్రాజెక్టు లో ఎంతో మంది స్టార్స్ భాగమవుతారని కూడా తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రభాస్ మీ సినిమా లో ఏ క్యారెక్టర్ కోసం తీసుకుంటారు అని కొంతమంది జక్కన్న ను ప్రశ్నించగా ప్రభాస్ కి అయితే కర్ణుడి పాత్రను ఇచ్చేస్తాను అంటూ కాసేపు ఆలోచించి అసలు విషయం చెప్పేసారు జక్కన్న. 
 
అయితే కర్ణుడి పాత్ర ని ప్రభాస్ తో రాజమౌళి చేయించడాని కంటే ముందే నాగ్ అశ్విన్  చేయించారు. ఎందుకంటే తాజాగా విడుదలై సంచలనం సృష్టించిన కల్కి 2898 AD మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ ని నాగ్ అశ్విన్ కర్ణుడి పాత్ర లో చూపించారు. అయితే ఈ సినిమా చూశాక కొంత మంది నెటిజన్స్ రాజమౌళి అప్పట్లో మాట్లాడిన వీడియో ను నెట్టింట్లో షేర్ చేస్తూ.. పాపం.. రాజమౌళి ప్రభాస్ తో చేయించాలనుకున్న పాత్రని నాగ్ అశ్విన్ ముందుగానే చేయించారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: