కల్కి 2898 AD వచ్చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఇక ఇప్పుడు సౌత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇండియన్2. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాతో కమల్ హాసన్ , శంకర్ మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కమల్, శంకర్ కాంబినేషన్ ఖచ్చితంగా నిరాశ పరచదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఇండియన్2 సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ పోషించిన పాత్ర వయస్సు 106 సంవత్సరాలు అని 106 ఏళ్ల తాత ఫైట్స్ ఎలా చేస్తాడని కొంతమంది ట్రోలర్స్ నుంచి ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. 


ఇందుకు సంబంధించి గతంలో బాగా ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే విమర్శలకు చెక్ పెట్టేలా ఒకింత ఘాటుగా డైరెక్టర్ శంకర్ జవాబిచ్చారు. చైనాలో లూ జియాన్ అనే మార్షన్ ఆర్ట్స్ మాస్టర్ 120 సంవత్సరాల వయస్సులో కూడా గాల్లో ఎగురుతున్నాడని ఫైట్స్ చేస్తూ కిక్స్ ఇస్తున్నాడని డైరెక్టర్ శంకర్ వెల్లడించారు.ఆ ప్రేరణతో ఈ సేనాపతి పాత్రను తీర్చిదిద్దానని ఆయన తెలిపారు.శంకర్ చేసిన కామెంట్లతో ఇకపై విమర్శలు చేసేవాళ్లు సైలెంట్ కావాల్సిందేనని తెలుస్తుంది. ఇండియన్2 సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. జులై రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను ఖచ్చితంగా షేక్ చేస్తుందని కమల్ హాసన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఇంకా ఈ సినిమా కనుక హిట్టైతే ఖచ్చితంగా గేమ్ ఛేంజర్  సినిమాపై కూడా అంచనాలు మరింత పెరిగే అవకాశాలు  ఉంటాయి. కొన్ని నెలల గ్యాప్ లోనే శంకర్ వరుస సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: