ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. అందులో భాగంగా ఈ మూవీ నార్త్ అమెరికాలో కూడా అత్యంత భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా ప్రీమియర్ షో టికెట్లను చాలా రోజుల నుండి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మూవీ పై మొదటి నుండి నార్త్ అమెరికా ప్రేక్షకులు మంచి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో ఈ మూవీ కి ఈ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లు ప్రీమియర్ షో ల ద్వారానే వచ్చాయి. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ప్రీమియర్ షో స్ ద్వారా వచ్చిన గ్రాస్ కలెక్షన్లు ఎన్ని అనే వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారానే 3.5 ప్లస్ మిలియన్ గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఈ సినిమాకు అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ప్రీమియర్స్ తోనే నార్త్ అమెరికాలో ఈ స్థాయి కలెక్షన్లను రాబట్టింది అంటే రాబోయే రోజుల్లో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను ఈ ఏరియాలో రాబట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరి ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , కీలక పాత్రలలో నటించగా ... కమల్ హాసన్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు. దిశ పటని ఈ మూవీలో హీరోయిన్గా నటించగా , వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ మూవీని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: