తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడు అయినటువంటి నాగ్ అశ్విన్, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న విజయ్ దేవరకొండకు మంచి స్నేహ బంధం ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరూ సినీ పరిశ్రమకు రాకముందు నుండే మంచి స్నేహితులు. ఇక సినీ పరిశ్రమకు వచ్చాక కూడా వీరి స్నేహం అలాగే కంటిన్యూ అవుతుంది. నాగ్ అశ్విన్ "ఎవడే  సుబ్రహ్మణ్యం" అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించాడు. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

సినిమా ద్వారా విజయ్ కి మంచి గుర్తింపు లభించింది. నాగి ఈ మూవీ తర్వాత మహానటి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో కూడా విజయ్ దేవరకొండ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా విజయ్ కి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. తాజాగా నాగి, ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 ఏడి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో కూడా విజయ్ దేవరకొండ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ రోజు కల్కి సినిమా విడుదల అయ్యింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ అత్యంత కీలకమైన పాత్రలో నటించాడు.  మహాభారతంలో అర్జునుడి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో అర్జునుడి పాత్రను విజయ్ పోషించాడు. ఇంతటి భారీ చిత్రంలో ,  గొప్ప పాత్ర విజయ్ కి దక్కడం ఎంతో అదృష్టమని చెప్పవచ్చు. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా తక్కువ సమయమే కనిపించిన దానితోనే విజయ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నా. ఇకపోతే కల్కి మొదటి భాగంలో విజయ్ నటించిన అర్జునుడి పాత్రకు సంబంధించిన ఎండింగ్ ఏమీ ఇవ్వలేదు. దానితో రెండవ భాగంలో కూడా ఈయన పాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయి. దానితో సెకండ్ పార్ట్ లో విజయ్ పాత్రకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: