కల్కి2898 AD: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అయింది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 


ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తీశారు. వై జయంతి మూవీస్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాను రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, శోభన వంటి ప్రముఖులు కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాకు అమితాబ్ బచ్చన్ నటన ప్లస్ పా యింట్ అయిందని టాక్ వినిపిస్తోంది. 


అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ చెబు తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దాదాపు ఈ సినిమాను నాలుగు వేలకు పైగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.... ప్రభాస్ దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా ఉన్నారు. 


కానీ కల్కి సినిమాకి తన రెమ్యూనరేషన్ సగానికి తగ్గించారట. సాధారణంగా ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా.... కల్కి సినిమాకు రూ. 80 కోట్లే తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు భారీగా బడ్జెట్ పెట్టాల్సి ప్రభాస్ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: