రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బి అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశ పటాని కీలక పాత్రలల్ నటించగా ... లోకనాయకుడు కమల్ హాసన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఈ మూవీ అత్యంత భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదల అయ్యి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ సినిమాపై ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఏదైనా సినిమా విడుదల అయ్యాక మంచి ప్రేక్షక ఆదరణ పొందుతుంది అంటే మెగాస్టార్ చిరంజీవి కూడా తన వంతుగా సినిమా గురించి నేరుగా లేదా సోషల్ మీడియా ద్వారా తన భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. తాజాగా కల్కి సినిమా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటున్న నేపథ్యంలో చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తాజాగా చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ. .. సినిమాకు సర్వత్ర సూపర్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

ఈ తరహా  సై - ఫై సినిమా తీసిన నాగ్ అశ్విన్ కి అభినందనలు. నాకు ఇష్టమైన నిర్మాత అశ్విని దత్ , ఆయన కుమారులు స్వప్న , ప్రియాంక మొత్తం యూనిట్ కి కంగ్రాట్స్. ఇలాగే కలలు కని భారత జెండాను మరింత పైకి ఎగరవేయండి అని చిరంజీవి పోస్ట్ చేశారు. ఇక చిరంజీవి "కల్కి" ఈ మూవీ గురించి తాజాగా స్పందిస్తూ పోస్ట్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: