సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే వారిలో చాలా మంది ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారు ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వ్యక్తుల మాదిరి గానే వారు కూడా ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలి అని కొంత మంది చాలా కష్టపడుతూ పని చేస్తూ ఉంటారు. ఇలా సక్సెస్ అయిన వారు తమ ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణాలను , ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఇండస్ట్రీ కి వచ్చాము అనే వివరాలను కొన్ని సందర్భాలలో తెలియజేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.

ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన ఇండస్ట్రీ కి రావడానికి గల కారణాలను , ఆయన ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అనే వివరాలను తాజాగా ఈ నటుడు చెప్పుకొచ్చాడు. తాజాగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ... నాకు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. ఆయన నటించిన పోకిరి సినిమా అంటే మరీ ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టం.

సినిమా చూసిన తర్వాత నాకు ఇండస్ట్రీ లోకి వచ్చి హీరో అవ్వాలి అనిపించింది. అలా మహేష్ హీరోగా రూపొందిన పోకిరి సినిమా వల్లే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన పోకిరి సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా ... పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd