పురాణాలు చాలా పవిత్రమైనవి. వాటితో సినిమా అంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా తీయాలి. ఏదైనా తేడా వస్తే హిందూ పెద్దలు సహించరు. 'ఆదిపురుష్' సినిమా విషయంలో ఇది ఏ రేంజ్ కి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అందరూ చూశారు.బాలీవుడ్ నిర్మాతలతో ప్రభాస్  చేసిన స్ట్రైట్ సినిమా ఇది. ‘తానాజీ’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకుడు. దాదాపు రూ.600 కోట్లు బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీశారు. కానీ ఆ బడ్జెట్ కి తగ్గట్టు విజువల్స్ ఏమీ కనిపించలేదు ఈ సినిమాలో.  వి.ఎఫ్.ఎక్స్ చాలా దారుణంగా నాసిరకంగా అనిపిస్తాయి.ప్రేక్షకుడికి ఓ కార్టూన్ సినిమా చూసిన ఫీలింగే అడుగడుగునా కలుగుతుంది. పోనీ కథ, కథనాలు ఏమైనా ఆకట్టుకున్నాయా అంటే అవి ఇంకా ఘోరంగా ఉన్నాయి. ప్రభాస్ కి రాముడి గెటప్ అస్సలు సెట్ అవ్వలేదు. ‘రామాయణం’ మూవీ తీస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎంత శ్రద్ధతో తీయాలి. ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ సినిమా చాలా అశ్రద్దతో తీసినట్టే స్పష్టంగా అనిపిస్తుంది. 


రావణాసురుడు వాహనం గబ్బిలం చూపించడం ఇంకా అతి సుందరమైన రావణ లంకని హాలీవుడ్ సినిమాల్లోని బూతు బంగ్లాలని చూపించడం, రావణాసురుడు తన వాహనానికి మటన్ తినిపించడం ఇంకా హనుమంతుని పాత్రతో మాస్ డైలాగులు చెప్పించడం..ఇలా ఓం రౌత్ చేసిన పొరపాట్లు చాలానే ఉన్నాయి.అందువల్ల నార్త్ లో సినిమా బాగా ఆడుతున్న టైంలో.. కేసులు వేసి అక్కడ ఆదిపురుష్ ని నిషేదించేలా కూడా చేశారు. అయితే ఈరోజు  కల్కి సినిమా వచ్చింది. ఇందులో కూడా మైథలాజికల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. కానీ నాగ్ అశ్విన్ ఎంతో శ్రద్ధ పెట్టి తీశాడు. సినిమాలో సైన్స్ ఫిక్షన్ ని జోడించిన తీరు కూడా చాలా బాగుంది.మహాభారతంలోని ఎలిమెంట్స్ ఇంకొన్ని ఉంటే బాగుణ్ణు అని జనాలు ఆశించారు.అన్నిటికీ మించి క్వాలిటీ విజువల్స్ ఐతే కనిపించాయి ఈ సినిమాలో. తెలుగు దర్శకుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో సినిమా తీయగలడు అని మరోసారి ఈ సినిమాతో రుజువైంది. అందుకే పనిలో పనిగా ‘ఆదిపురుష్’ సినిమా దర్శకుడు ఓం రౌత్ ని మరోసారి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: