సినీ పరిశ్రమలో కొంతమందికి అవకాశాలు ఎంత కష్టపడినా రావు. కానీ మరి కొంత మందికి మాత్రం అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. అలా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు. ఈమె కన్నడ సినిమా అయినటువంటి కీరిక్ పార్టీ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది. రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది.

ఇక ఈ మూవీ లో ఈమెకు అవకాశం ఎలా వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం. కన్నడ సినీ పరిశ్రమలో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రక్షిత్ శెట్టి "కిరిక్ పార్టీ" సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఓ అమ్మాయిని వెతుకుతున్న సమయంలో రష్మిక కు సంబంధించిన ఫోటోలు ఒక మ్యగజైన్ పై వచ్చాయట.

వాటిని చూసిన తర్వాత ఈ అమ్మాయి అయితే కిరిక్ పార్టీ సినిమాలో హీరోయిన్ గా బాగుంటుంది అని అనుకున్న రక్షిత్ శెట్టి ఆమెను సంప్రదించడం , ఆమె కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం , అలా పెద్దగా ఏ మాత్రం కష్టపడకుండా రష్మిక కు "కిరిక్ పార్టీ" సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

మూవీ తో ఈమెకు కన్నడ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ ప్లేస్ కి వెళ్లి పోయింది. ఇక ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ్ , హిందీ సినిమాలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఈ బ్యూటీ కెరీర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm