టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య మూవీతో దర్శకుడిగా కెరీర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడం, అలాగే ఈ సినిమా యొక్క కథ ,  స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండడంతో ఈ మూవీతో సుకుమార్ కి తెలుగులో సూపర్ క్రేజ్ లభించింది. ఆ తర్వాత నుండి కూడా ఈయన డిఫరెంట్ కథాంశాలతో అంతే డిఫరెంట్ గా సినిమాలను తెరకెక్కిస్తూ రావడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు.

ఆఖరుగా ఈ దర్శకుడు అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీ ని మొదట ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన అనేక పనులు ఆ తేదీ వరకు పెండింగ్ ఉండే అవకాశం ఉండడంతో ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన ఒక సన్నివేశం చిత్రీకరణ చాలా లేట్ కావడంతో కోపంతో ఒక కాస్ట్లీ ఐ ఫోన్ ను దర్శకుడు సుకుమార్ పగలగొట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళితే ... ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ... పుష్ప పార్ట్ 2 మూవీ కి సంబంధించిన ఒక సన్నివేశాన్ని సుకుమార్ తెరకెక్కించే విషయంలో ఆయనకు చాలా ఇబ్బంది కలిగిందట. అప్పటికే చాలా టేకులు అయినా కూడా ఆ సన్నివేశం ఆయన అనుకున్న స్థాయిలో రావడం లేదట. దానితో విసిగిపోయిన సుకుమార్ కోపంతో ఓ ఖరీదైన ఐ ఫోన్ ను పగలగొట్టినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఏదేమైనా ప్రస్తుతానికి పుష్ప పార్ట్ 2 మూవీ పై మాత్రం ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: