రెబల్ స్టార్ ప్రభాస్ "మిర్చి" సినిమా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కెరియర్ను కొనసాగించాడు. ఎప్పుడు అయితే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడో అప్పటి నుండి ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సినిమా తర్వాత నుండి ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో , అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.

దానితో ఈయన నటించిన సినిమాలకు అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ జూన్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీపై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండడం, అలాగే ఈ సినిమాలోని ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఫ్రీ రిలీజ్ బిసినెస్ జరిగింది.

మూవీ కి 390 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ మూవీ 395 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 800 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక ఈ రోజు విడుదల అయిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. ఈ మూవీ కి సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు 800 వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేయడం పెద్ద విషయం ఏమీ కాదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

ఈ సినిమాతో ప్రభాస్ ఏ స్థాయి కలెక్షన్లను రాబడతాడు చూడాలి. ఈ మూవీ లో అమితాబ్ బచ్చన్ , దీపికా పదుకొనే , దిశ పటని కీలకపాత్రలలో నటించగా, కమల్ హాసన్ హీరోయిన్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు. వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: