ఈ రోజు ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD అనే సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించగా ... దిశా పటనీ ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటించింది. లోక నాయకుడు కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించాడు. ప్రముఖ సంగీత దర్శకుడు అయినటువంటి సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇకపోతే ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు , దర్శకులు నటిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ఈ మూవీ లో ప్రముఖ హీరోలు అయినటువంటి విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , నాచురల్ స్టార్ నాని నటించబోతున్నట్లు , అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ రోజు సినిమా విడుదల అయింది. మొదటి నుండి వచ్చిన వార్తల ప్రకారం చూసినట్లయితే ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని నటించిన లేదు.

కానీ విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ చిన్న చిన్న పాత్రలలో నటించారు. అలాగే ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమాలో అనూహ్యంగా రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి వార్తలు బయటికి రాలేదు. సడన్ గా ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ కనిపించడంతో థియేటర్స్ అంతా అరుపులతో మారు మోగింది. రామ్ గోపాల్ వర్మ ను ఈ సినిమాలో నాగ్ అశ్విన్ భాగం చేస్తాడు అని పెద్దగా ఎవరు ఊహించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: