నాని హీరోగా రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా తన కెరీర్లు మొదలు పెట్టాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. ఈ మూవీ తర్వాత నాగి కాస్త సమయం తీసుకుని మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. కమర్షియల్ గా కూడా బాగా కలక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాతో ఈయనకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది.

మూవీ తర్వాత ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా కల్కి అనే సినిమాను అనౌన్స్ చేశాడు. చాలా సంవత్సరాలుగా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు అనగా జూన్ 27 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. అద్భుతమైన క్రేజ్ ఉన్న ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటించడం , ఈ  మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించడం , అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ,  దిశా పటనీ , కమల్ హాసన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బాస్టర్ పాజిటివ్ టాక్ ప్రపంచ వ్యాప్తంగా దక్కింది.

దానితో ఈ మూవీ కి ప్రీమియర్ షోస్ నుండి నైట్ షోస్ వరకు దాదాపు అన్ని ఏరియాలలో హౌస్ ఫుల్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు చాలా మంది అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డ్ సృష్టించనుందని కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: