సినిమా నటీనటులకు సంబంధించిన అనేక వార్తలను మనం వింటూ ఉంటాం. అందులో భాగంగా వారు ఒక సినిమాకు అన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు... ఇన్ని కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు అనే వార్తలను కూడా చాలా వరకు వింటాం. ఇకపోతే కొంత మంది నటీనటులు కొన్ని సందర్భాలలో తాము గతంలో తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే కూడా కొన్ని సినిమాలకు తక్కువ పారితోషకాన్ని తీసుకుంటూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఆ సమయంలో వారి క్రేజ్ ఏమాత్రం తగ్గకపోయిన సినిమాకు బడ్జెట్ తగ్గాలి అనే ఉద్దేశం తోనే వారు అలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు.

ఇకపోతే తాజాగా ప్రభాస్ "కల్కి 2898 AD" అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకు 600 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి భారీ బడ్జెట్ కావడంతో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ని దాదాపుగా సగం తగ్గించినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో మూవీ కి దాదాపుగా 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండగా , కల్కి సినిమాకు అత్యంత భారీ బడ్జెట్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ కేవలం ఈ సినిమాకు 80 కోట్ల రెమ్యూనిరేషన్ మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా కల్కి సినిమా కోసం ఈయన పెద్ద త్యాగం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈరోజు విడుదల అయిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటానీ , కమల్ హాసన్ ముఖ్య పాత్రలలో నటించగా... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: