రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి అనే పాన్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 118 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ సమయంలో ఇది పెద్ద మొత్తం ఫ్రీ రిలీజ్ బిజినెస్. ఇక ఈ మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

దానితో బాహుబలి రెండవ భాగానికి ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 352 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజే సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక బాహుబలి 2 సినిమాతో ప్రభాస్ క్రేజ్ చాలా పెరిగిన ఆ తర్వాత ఈయన నటించిన సహో , రాదే శ్యామ్ , ఆది పురుష్ , సలార్ సినిమాలకు భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినప్పటికీ బాహుబలి 2 సినిమాకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను మాత్రం ఈ సినిమాలు ఏవి కూడా బీట్ చేయలేకపోయాయి.

ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ "కల్కి 2898 AD" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ రోజు విడుదల అయింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 382 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి బాహుబలి 2 కంటే ఎక్కువ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: