తెలుగు, తమిళ ఇండస్ట్రీలల్ స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాలు కెరీర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో త్రిష ఒకరు. ఈనటి తెలుగులో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోలుగా నటించిన సినిమాలలో ఆడి పాడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా ఆ తర్వాతి జనరేషన్ హీరోలు అయినటువంటి సుపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమాలలో కూడా నటించి ఎన్నో సంవత్సరాలు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే తమిళంలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ అక్కడ కూడా అద్భుతమైన జోష్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగించింది. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా ఎక్కువ శాతం తమిళ ఇండస్ట్రీ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది.

అందులో భాగంగా ఈమె ఇప్పటికి కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తుంది. ఈమె వయసు పెరిగినా కూడా అందం ఏమాత్రం తగ్గకపోవడంతో ఈమెకు కోలీవుడ్లో వరస అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. ఈమె నటిస్తున్న సినిమాలలో ఎక్కువగా శాతం మూవీలు మంచి విజయాలు కూడా సాధిస్తూ ఉండడంతో ఈమెకు అదిరిపోయే రేంజ్ లో పారితోషకం కూడా అనేక మంది నిర్మాతలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈమెకు ఒక్కో సినిమాకు దాదాపు 12 కోట్ల రెమ్యూనిరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో నయనతార , త్రిష మాత్రమే ఈ స్థాయి పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వయస్సు పెరిగిన అందం ఏ మాత్రం తగ్గకపోవడం , ఈమె నటిస్తున్న సినిమాలలో ఎక్కువ శాతం మూవీలు వరుస విజయాలను అందుకుంటు ఉండడంతో త్రిష కు ఇప్పటికి కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: