ఆగస్టు 15న విడుదలకావలసి ఉన్న ‘పుష్ప 2’ డిసెంబర్ కు వాయిదా పడటంతో ఇప్పుడు ఆ డేట్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రామ్ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో ఎప్పుడో విడుదల కావలసి ఉన్న ‘డబల్ ఇస్మార్ట్’ ఆగష్టు 15న విడుదల కాబోతోంది. ఈమూవీతో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ కూడ విడుదల కావలసి ఉన్నప్పటికీ ఆమూవీ కూడ వాయిదా పడే అవకాశం ఉంది అంటున్నారు.



ఇప్పుడు ఈవార్త వైరల్ కావడంతో అనేక చిన్న సినిమాలు ఆగష్టు 15కు రావడానికి చాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పూరీ రామ్ ల కాంబినేషన్ అంటే మంచి మాస మూవీ అన్న అంచనాలు ఉన్నాయి. ఇన్ని అంచనాలు ఉన్నప్పటికీ చిన్న హీరోలు రామ్ తో పోటీపడి రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. నివేద థామస్ ప్రియదర్శి లు నటించిన చిన్న కథ మూవీ విడుదల కాబోతోంది.



అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె నటించిన అతడి రెండవ సినిమా కూడ ఆగష్టు 15 డేట్ లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి కాకుండా బాలీవుడ్ చిత్రాలు ‘వేదా’ ‘స్త్రీ 2’ విడుదల అంటున్నారు. వాస్తవానికి పూరీ జగన్నాథ్ రామ్మూవీ అంటే యూత్ లో అదేవిధంగా మాస్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంటుంది.



దేనికితోడు కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ కొట్టిన ‘ఇస్మార్ట్  శంకర్’ మూవీకి ఇది సీక్వెల్ కావడంతో సహజంగా అందరిలోనూ ఆశక్తి ఉంటుంది. అయితే చిన్న హీరోలు రామ్ ను అదేవిధంగా పూరీ జగన్నాథ్ ని లైట్ గా అంచనవేయడం ఒక విధంగా పూరీకి ఊహించని షాక్ అనుకోవాలి ఇప్పటికే వరసపెట్టి పరాజయాలు అటు రామ్ ని ఇటు పూరీని వెంటాడుతూ ఉండటంతో చిన్న హీరోలు ఈ సాహసం చేస్తున్నారు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: