టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ ఆతరువాత కాలంలో తన ప్రాభవాన్ని పూర్తిగా పోగొట్టుకుంది. దీనీతో హైదరాబాద్ నుండి ముంబాయి వెళ్ళి అక్కడ బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో అక్కడ సెటిల్ అవుదామని ఆమె చేసిన ప్రయత్నాలు అక్కడ కూడ ఫెయిల్ అవ్వడంతో ఇక లాభం లేదనుకుని క్రితం సంవత్సరం తన బాయ్ ఫ్రెండ్ నిర్మాత రాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని ప్లాన్ వేసుకుంది అని అంటారు.



అయితే ఇక్కడ కూడ ఆమెకు దురదృష్టం వెంటాడిందా అని అంటారు. ఆమె భర్త రాకీ భగ్నానీ ప్రముఖ నిర్మాత బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటి అయిన ప్రొడక్షన్ హౌస్ పూజ ఎంటర్ టైన్మెంట్ బ్యానయర్ పై అనేక సినిమాలు నిర్మించాడు. అయితే గత కొంతకాలంగా అతడి నిర్మాణ సంస్థను నష్టాలు వెంటాడుతున్నాయి. టైగర్ ష్రాఫ్ హీరోగా తీసిన ‘గణ్‌పథ్’ గత ఏడాది బాలీవుడ్ లో విడుదలైన సినిమాలలో భారీ ఫ్లాప్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సంవత్సరం అదే బ్యానర్ పై నిర్మించిన ‘బడేమియా చోటేమియా’ కూడ భారీ ఫ్లాప్ గా రికార్డులు క్రియేట్ చేసింది.



ఈసినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమూవీ నిర్మాత రకుల్ భారత అయిన రాఖీ కి భారీ నష్టాలు వచ్చాయని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈ రెండు సినిమాల నష్టంతో ఈ నిర్మాణ సంస్థలో పనిచేసే 80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చి చిన్న ఆఫీస్‌కు మారిపోయారు అంటూ బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి రకుల్ ప్రీత్ అభిమానులు బాధ పడుతున్నారు.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ మూవీలో రకుల్ ఒకకీలక పాత్రలో నటిస్తోంది. ఈమూవీ హిట్ అయితే తిరిగి తనకు మళ్ళీ అవకాశాలు వచ్చి తాను బిజీ హీరోయిన్ గా మారిపోతాను అని ఆమె కలలు కంటోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: