పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898AD. ఈ సినిమా నిన్నటి రోజున పాన్ ఇండియా లెవెల్ లో భారీ థియేటర్లో విడుదలై హిట్ టాకుతో దూసుకుపోతోంది. ఈ సినిమా కంటెంట్ విజువల్ విఎఫ్ఎక్స్ కూడా అభిమానులను ఫిదా అయ్యేలా చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ముఖ్యంగా ఇందులో అమితాబచ్చ, కమలహాసన్, దిశాపటాని, దీపికా పదుకొనే, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితర నటీనటులు సైతం నటించడంతో ఈ సినిమాకి మరింత హైప్ ఏర్పడింది.


హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ చూసి ఫిదా అయ్యారు ఫాన్స్. దాదాపుగా రూ .600 కోట్ల రూపాయల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ  200 కోట్లకు పైగా మొదటి రోజే రాబడుతుందని అంచనా వేసినప్పటికీ.. కల్కి సినిమా ఇండియన్ సినిమాలోని మూడవ అతి పెద్ద ఓపెనింగ్ నమోదుగా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద ఒకసారి కొత్త చరిత్రను సైతం సృష్టించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కల్కి సినిమా మొత్తం మీద 115 కోట్ల రూపాయలు ఇండియా వైడ్ గా రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా విషయానికి వస్తేరూ .150 కోట్లకు పైగా మొదటి రోజా రాబట్టినట్లు తెలుస్తోంది.


ఇన్ని కోట్లు రాబట్టిన ఇండియన్ మూడవ సినిమాగా నిలిచింది కల్కి ఇప్పటివరకు భారతదేశంలో కేజిఎఫ్-2 చిత్రం రూ.159 కోట్లు.. సలార్ రూ .158 .. లియో రూ.142.. సాహో రూ .130 జవాన్  రూ.129 కోట్లు రాబట్టగా.. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన rrr చిత్రం మొదటి రోజే రూ .223 కోట్ల రూపాయలను రాబట్టింది.. ఆ తర్వాత స్థానం బాహుబలి-2 ఈ సినిమా  రూ.217 కోట్ల రూపాయలు రాబట్టింది. ఆ తర్వాతే కల్కి ప్రాజెక్ట్ సినిమా రూ .180 కోట్లు రాబట్టి మూడవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: