నిన్న అనగా జూన్ 27 వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రపంచం లోని దాదాపు అన్ని ఏరియాలలో సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వచ్చాయి.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు మొదటి రోజు దక్కినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సీడెడ్ ఏరియాలో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ దక్కాయి. ఈ మూవీ కి మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 5.06 కోట్ల షేర్ కలక్షన్ లు దక్కినట్లు తెలుస్తోంది. ఇలా కల్కి సినిమా సీడెడ్ ఏరియాలో కూడా అదిరిపోయే రేంజ్ షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో మరో మూడు రోజులు కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్ సీడెడ్ ఏరియాలో దక్కే అవకాశం ఉంది.

మరి టోటల్ గా సీడెడ్ ఏరియాలో ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించగా , అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశ పటని ఈ మూవీ లో కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: