ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా పై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా 8 వేలకు పైగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల కావడం ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ కి రిలీజ్ అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల కి పైగా గ్రాస్ కలెక్షన్ లు వచ్చే అవకాశం ఉన్నట్లు చాలా మంది సినీ అనలిస్ట్ లు అంచనా వేస్తున్నారు.

మరి ఈ మూవీ కి మొదటి రోజు ఏ స్థాయి కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలు క్లారిటీగా తెలియాలి అంటే మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ యొక్క ఓ టీ టీ పార్ట్నర్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయ్యాక ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని డేట్ నిర్మించగా ... నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ,  దిశా పటానీ , కమల్ హాసన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: