ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు.బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా బిజినెస్ విషయంలో అదరగొడుతుంది.ఈ సినిమా తెలుగు వెర్షన్ తో పాటు మలయాళ వెర్షన్ ని కూడా భారీ ధరకు అమ్మేసినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 కన్నడ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. పుష్ప 2 కన్నడ రైట్స్ ని 32 కోట్లకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుందని సమాచారం.ప్రస్తుతం పుష్ప 2 పై ఉన్న బజ్ కి ఆ సినిమా భారీ విజయం సాధించినట్లయితే మాత్రం సినిమా వసూళ్లు సునామిని ఆపడం మాత్రం కష్టం. పుష్ప 2పై కన్నడ లో ప్రస్తుతం  భారీ హైప్ ఉంది. అందుకే ఈ రేంజ్ ధర పలికినట్టు తెలుస్తుంది. పుష్ప 2 సినిమాతో మరోసారి తన ఊర మాస్ యాక్టింగ్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు అల్లు అర్జున్.దర్శకుడు సుకుమార్ కూడా సీక్వెల్ పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 6 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ముందుగా ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్ 6 కు వాయిదా పడింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: