నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన కేవలం సౌత్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అటు బాలీవుడ్ లోను వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టు లో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక మందన. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆగస్టులో విడుదల అయ్యే ఈ సినిమాను ఇటీవల డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర

 సినిమాలో సైతం హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలకపాత్రలో కనిపించబోతున్నారు. అయితే తెలుగులో ఈ సినిమాలో చేస్తుండగా మరోవైపు రెయిన్బో ది గర్ల్ ఫ్రెండ్ చావా లాంటి సినిమాల్లో కూడా నటిస్తోంది. వాటితో పాటు హిందీలో సికిందర్ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ కి జంటగా కనిపించబోతోంది. అలా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ నటి. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు మరో రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట నేషనల్ క్రష్ రష్మిక మందన. తమిళ హీరో శివ

 కార్తికేయన్‌కు జంటగా ఓ సినిమా చేయబోతోందట. 'డాన్‌' కాంబినేషన్‌ రిపీట్ చేస్తూ సీబీ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు శివ కార్తికేయన్. ఎస్‌.జె.సూర్య ఇందులో కీలకపాత్ర పోషించనుండగా.. హీరోయిన్‌గా రష్మికను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా తెరకెక్కబోయే 'వాంపైర్స్‌ ఆఫ్‌ విజయ్‌నగర్‌' అనే హారర్ మూవీలోనూ హీరోయిన్‌గా రష్మికను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆదిత్య సత్పోదర్‌ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని స్త్రీ, భేడియా లాంటి హారర్ థ్రిల్లర్స్‌ నిర్మించిన దినేష్ విజన్ ప్రొడ్యూస్ చేయనున్నారు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఖాతాలో మరో రెండు సినిమాలు చేరబోతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: