ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి సినిమా నిన్న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు భారీ ఎత్తున కలక్షన్లను రాబట్టింది. అందులో భాగంగా సీడెడ్ లో కూడా ఈ సినిమా మొదటి రోజు 5.06 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. కానీ ఈ మూవీ ఈ ఏరియాలో చాలా పెద్ద మొత్తం షేర్ కలక్షన్లను రాబడుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ స్థాయి కలెక్షన్లను ఈ మూవీ సీడెడ్ ఏరియాలో రావట్లేదు. మరి సీడెడ్ ఏరియాలో ఇప్పటి వరకు విడుదల అయిన తెలుగు సినిమాలలో మొదటి రోజు కలెక్షన్లలో కల్కి మూవీ ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ సీడెడ్ ఏరియాలో మొదటి రోజు 17 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా , ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ 6.55 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి రెండవ స్థానంలోనూ నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ 6.45 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి మూడవ స్థానంలోనూ , ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా 6.35 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది.


ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా 5.91 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలోనూ , ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అరవింద సమేత సినిమా 5.48 కోట్ల కలెక్షన్లతో 6 వ స్థానంలోనూ , ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 1 సినిమా 5.08 కోట్ల షేర్ కలెక్షన్లతో 7 వ స్థానంలోనూ , ఇక ఆ తర్వాత ప్రభాస్ తాజాగా హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా 5.06 కోట్ల షేర్ కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: