నటి అతిథి రావు హైదరి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా ద్వారా తనకు జరిగిన ఒక సంఘటనను తెలియజేసింది. అసలు విషయంలోకి వెళితే ... యూకేలోని హీత్రూ విమానాశ్రయంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని అదితీ రావు హైదరి తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా పంచుకుంది.

అందులో తన లగేజీ మాయమైందని , దాని కోసం గంటల తరబడి ఎయిర్ పోర్ట్ లోనే ఎదురు చూస్తూ ఉండాల్సి వచ్చిందని ఈ బ్యూటీ ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడి అధికారులను అడిగితేనేమో వారు ఏమి పట్టించుకోకుండా చేతులెత్తేశారని ... సంబంధిత ఎయిర్‌ లైన్ ను సంప్రదించమన్నారని ఈమె పేర్కొంది. ఇక ఇంత చెత్త ఎయిర్‌ పోర్టు ను తానెప్పుడూ చూడలేదంటూ తన అసహనాన్ని అదితి రావు హైదారి వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితమే అదితి మరియు నటుడు సిద్ధార్థ్ కి ఎంగేజ్మెంట్ జరిగింది. మరికొన్ని రోజుల్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.

ఇకపోతే తాజాగా ఈ నటి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన హిరామండి అనే వెబ్ సీరీస్ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో ఈమె వేశ్య పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను , విమర్శకులను మెప్పించింది. ఈ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు రావడంతో ఈ సిరీస్ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈమె సమ్మోహనం , మహా సముద్రం సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

arh